Telegram Join Group

NTR Bharosa New Pensions: August నుండి కొత్తగా 1,09,155 మందికి పెన్షన్ మంజూరు

NTR Bharosa Pension: August నుండి కొత్తగా 1,09,155 మందికి పెన్షన్ మంజూరు

🗓️ August 1 నుండి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ప్రతి నెలా ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలు జరిగిన నేపథ్యంలో, కొత్తగా చేరిన సిబ్బందికి లాగిన్‌లు క్రియేట్ చేసి పెన్షన్ పంపిణీకి సిద్ధమయ్యారు.

👵 కొత్తగా స్పౌజ్ (వితంతు) పెన్షన్లు మంజూరు

ఆగస్టు 1వ తేదీ నుండి కొత్తగా 1,09,155 మంది వితంతువులకు స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు చేస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు ప్రకటించారు. భర్త మరణించిన వెంటనే భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేసే విధంగా కొత్త విధానం తీసుకువచ్చినట్టు తెలిపారు.

BSNL Azadi Ka Plan 2025: రూ.1కే 30 రోజుల ఫ్రీ కాల్స్‌, డేటా, SMS

💰 ప్రభుత్వం ఖర్చు: రూ.43.66 కోట్లు అదనంగా

ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.43.66 కోట్లు అదనంగా వెచ్చించనుంది. వితంతు పెన్షన్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఇది ఎంతో శుభవార్తగా మారనుంది.

💸 ప్రతి నెలా రూ.4000 చొప్పున లబ్ది

ఇప్పటినుండి కొత్తగా మంజూరైన వితంతు మహిళలకు నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ లభించనుంది.

AP Smart Ration Cards 2025: ఆగష్టు 25 నుంచి పంపిణీ ప్రారంభం – పూర్తి వివరాలు

NTR Bharosa Pension 2025 , August 1 pensions update Andhra Pradesh , SERP Pension Latest Update , AP Widow Pension 4000

Thalliki vandanam Payment News: విడుదల