AP P4 Survey 2025: Bangaru Kutumbam Eligibility & Margadarshi Details in Telugu
పేదరిక నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక చొరవే P4 Need Assessment Survey 2025. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో అత్యంత అవసరమున్న కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించనుంది.
సర్వే ప్రారంభం: 20 జూలై 2025
యాప్ ద్వారా నమోదు: P4 Need Assessment Survey App
సర్వే చేపట్టేది: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది
Bangaru Kutumbam Eligibility అంటే ఏంటి?
ఈ క్రింది సమస్యలలో ఒకటి అయినా ఉన్న కుటుంబం బంగారు కుటుంబంగా గుర్తింపు పొందుతుంది:
- LPG గ్యాస్ కనెక్షన్ లేకపోవడం
- ఇంటిలో విద్యుత్ కనెక్షన్ లేకపోవడం
- కుటుంబ ఆదాయం లేకపోవడం
- తాగునీరు లేకపోవడం
- బ్యాంక్ ఖాతా లేకపోవడం
Bangaru Kutumbam Ineligibility – ఎవరు అర్హులు కారూ?
ఈ క్రింది పరిస్థితులలో ఉన్నవారు P4 సర్వేలో అర్హులు కాదు:
- 5 ఎకరాలకుపైగా పొలం / 2 ఎకరాలకుపైగా తడిబడి భూమి కలిగినవారు
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నవారు
- మున్సిపల్ ప్రాపర్టీ కలిగినవారు
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు
- 4 వాహనాలు కలిగిన కుటుంబం
- నెలకు 200 యూనిట్లకుపైగా కరెంట్ వాడకం ఉన్నవారు
P4 Need Assessment Survey లో ఏం అడుగుతారు?
సర్వేలో అడిగే కొన్ని ప్రధానమైన ప్రశ్నలు ఇవే:
- కుటుంబ సభ్యుల వివరాలు (పేరు, వయసు, సంబంధం)
- నెల ఆదాయం & ఆదాయ రకం
- ఇంటి స్థితి – GPS లొకేషన్, చిరునామా
- గృహ అవసరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి
- ఆడియో ఫార్మాట్ లో అభిప్రాయం
మార్గదర్శి ఎవరు? ఎలా నమోదు అవ్వాలి?
మార్గదర్శి (Margadarshi) అంటే సహాయం చేసేందుకు ముందుకొచ్చినవారు. వీరు స్వచ్ఛందంగా సేవ అందిస్తారు.
👉 అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్గదర్శి రిజిస్ట్రేషన్:
🔗 Click Here to Register as Margadarshi
బంగారు కుటుంబాల రిజిస్ట్రేషన్ కోసం కూడా అదే లింక్ ఉపయోగించవచ్చు.
FAQ’S
1. AP P4 Need Assessment Survey అంటే ఏంటి?
P4 అంటే Public, Private, People Partnership. ఇది ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రజల మద్దతుతో పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం అందించే విధానం.
2. సర్వే ఎప్పుడు మొదలైంది?
2025 జూలై 20 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
3. Bangaru Kutumbam గా ఎలా గుర్తిస్తారు?
ప్రాథమిక అవసరాలు లేని అత్యంత అవసరమున్న కుటుంబాలను ఎంపిక చేస్తారు.
4. సర్వేలో నా పేరు లేకుంటే?
గ్రామ సభలో / యాప్ ద్వారా కొత్తగా జతచేసే అవకాశం ఉంది.
5. Margadarshi ఎలా అవ్వాలి?
ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
TAGS
P4 Survey App, Bangaru Kutumbam List, Margadarshi Registration, AP Govt Scheme, AP P4 2025, Public Private People Partnership, AP Poverty Eradication Scheme