ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మంచి వార్త! నెలకు ₹3,000 వేతనంతో Nirudyoga Bruthi Scheme మరోసారి ప్రారంభం కాబోతుంది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం లేని డిగ్రీ పాసైన యువతికి తాత్కాలిక ఆర్థిక భరోసా లభిస్తుంది.
Nirudyoga Bruthi Scheme అంటే ఏమిటి?
ఈ పథకం కింద, ఉద్యోగం లేకుండా ఉన్న యువతకు నెలకు ₹3,000/- చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది ఉద్యోగం వచ్చే వరకు వారిని ప్రోత్సహించే ఒక మద్దతు వ్యవస్థగా రూపొందించబడింది.
Eligibility Criteria (అర్హతలు)
ఈ పథకానికి అర్హత పొందడానికి మీరు క్రింది షరతులను కలిగి ఉండాలి:
విద్యార్హత: డిప్లొమా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి
వయస్సు: 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
ఉద్యోగం: ప్రస్తుతానికి ఉద్యోగం ఉండకూడదు
రేషన్ కార్డు: తెల్ల రేషన్ కార్డు ఉండాలి
భూమి: 5 ఎకరాల కంటే తక్కువ భూమి (అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు)
వాహనం: కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
ప్రభుత్వ ఉద్యోగి: కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు
రుణం / సబ్సిడీ: రూ.5 లక్షలకు మించిన ప్రభుత్వ రుణం లేదా సబ్సిడీ తీసుకోకూడదు
స్కాలర్‌షిప్: ప్రస్తుతానికి స్కాలర్‌షిప్ తీసుకుంటున్నవారు అర్హులు కాదు
విద్య: ప్రస్తుతానికి చదువుతున్నవారు కూడా అర్హులు కాదు
పెన్షన్: కుటుంబంలో పెన్షన్ పొందే వారు ఉండకూడదు
Required Documents (అవసరమైన పత్రాలు)
దరఖాస్తు చేసేటప్పుడు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
ఆధార్ కార్డు (మొబైల్ నంబర్‌తో లింక్ చేయాలి)
బ్యాంక్ ఖాతా (ఆధార్‌తో లింక్ చేయాలి)
విద్యార్హత సర్టిఫికెట్లు (డిప్లొమా/డిగ్రీ/పీజీ)
హాల్ టికెట్ నంబర్‌లు
వ్యక్తిగత ఇమెయిల్ ID
పని చేస్తున్న మొబైల్ నంబర్ (OTP కోసం అవసరం)
Application Process (దరఖాస్తు ఎలా?)
దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ లో ఉంటుంది
అధికారిక పోర్టల్ లింక్ ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు
దరఖాస్తు తేదీలు & వెబ్‌సైట్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు
దయచేసి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా విశ్వసనీయ న్యూస్ పోర్టల్స్ ద్వారా సమాచారం పొందండి
ఎటువంటి ఫేక్ సైట్‌లను నమ్మవద్దు
Nirudyoga Bruthi Scheme Launch Date?
ఈ స్కీమ్‌ను 2025 చివరి నాటికి ప్రారంభించనున్నట్లు అధికారికంగా MLA అశోక్ రెడ్డి ప్రకటించారు
పూర్తి అమలు వివరాలు త్వరలో మంత్రివర్గ సమావేశంలో ఖరారు అవుతాయి
Nirudyoga Bruthi Scheme AP – FAQs
Q1. నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలవుతుంది?
2025 చివరలో అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
Q2. నెలకు ఎంత మొత్తం ఇస్తారు?
నెలకు ₹3,000/- ఇవ్వబడుతుంది.
Q3. డిగ్రీ అయిపోతే తప్పనిసరిగా ఉద్యోగం రాకపోతేనే ఇవ్వడమా?
అవును. ఉద్యోగం లేకపోతే మాత్రమే అర్హులు.
Q4. దరఖాస్తు ఎక్కడ చేయాలి?
ఆన్‌లైన్‌లో చేయాలి – అధికారిక పోర్టల్ వివరాలు త్వరలో వెలువడతాయి.
Q5. స్కాలర్‌షిప్ తీసుకునే వారు అర్హులేనా?
లేదు. ప్రస్తుతం స్కాలర్‌షిప్ తీసుకునే వారు అర్హులు కారు.
Nirudyoga Bruthi Scheme AP నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే వరకూ ఆర్థికంగా నిలబడేందుకు మంచి అవకాశం. దరఖాస్తు ప్రారంభమైన తర్వాత వెంటనే అప్లై చేసుకోవాలని సూచన. అధికారిక ప్రకటనల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయండి.
TAGS
Nirudyoga Bruthi Scheme AP, Unemployment Allowance AP 2025, AP 3000 Youth Scheme, Nirudyoga Bruthi Online Apply, AP Youth Welfare Schemes 2025, AP TDP Government Schemes