SBI PO ప్రిలిమ్స్ రిజల్ట్ 2025 – రిజల్ట్ విడుదల ఎప్పుడంటే?
బ్యాంక్ ఉద్యోగానికి రెడీ అవుతున్నవారికి గుడ్ న్యూస్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్వహించిన PO ప్రిలిమినరీ పరీక్షలు 2025 ఆగస్ట్ 2, 4, 5 తేదీల్లో ముగిశాయి. ఇప్పుడు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 3వ లేదా 4వ వారంలో రిజల్ట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబరులో జరుగనున్న నేపథ్యంలో రిజల్ట్ త్వరగా రావొచ్చని అంచనా.
How to check SBI PO Result 2025
- అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయండి
- ‘SBI PO Prelims Result 2025’ లింక్‌పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేది, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి Submit చేయండి
- స్క్రీన్‌పై రిజల్ట్ వస్తుంది – డౌన్లోడ్ చేసుకోవచ్చు
SBI PO Mains Exam Date 2025
- SBI PO Mains Exam – సెప్టెంబర్ 2025
- అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్‌కు కొన్ని రోజుల ముందే రిలీజ్ అవుతుంది
- కట్-ఆఫ్ మార్క్స్ దాటిన అభ్యర్థులకే మెయిన్స్ హక్కు ఉంటుంది
చివరి స్టేజ్ – ఇంటర్వ్యూ
మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి ఇంటర్వ్యూకు కాల్ వస్తుంది. ఇంటర్వ్యూలో కూడా విజయవంతమైతే, SBIలో Probationary Officer పోస్టులో నియామకం జరుగుతుంది.
భర్తీ కానున్న పోస్టులు:
- మొత్తం పోస్టులు: 541
- రెగ్యులర్ పోస్టులు: 500
- బ్యాక్‌లాగ్ పోస్టులు: 41