2025 జూలై 31న స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కారణం? స్వాతంత్ర్య సమరయోధుడు ఉధమ్ సింగ్ జయంతి. పంజాబ్‌లో జన్మించిన ఈ యోధుడు 1940లో బ్రిటిష్ జనరల్ డయ్యర్‌ను హత్య చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారు. ఆయన స్మారకంగా పంజాబ్ ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై 31న సెలవు ఇస్తోంది.
ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ గెజిట్ విడుదలైంది. ఫలితంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్.
అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు నెలలో వరుస సెలవులు ఉండే సూచనలు ఉన్నాయి:
ఆగస్టు 8: వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 9: రాఖీ పౌర్ణమి
ఆగస్టు 10: ఆదివారం
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఈ రోజులు విద్యార్థులు, ఉద్యోగులకి విశ్రాంతి సమయాన్ని కల్పించనున్నాయి.
TAGS
School holiday tomorrow, July 31 holiday 2025, Udham Singh holiday news, Punjab public holiday, school holiday news today, colleges closed tomorrow